గద్వాల: దివ్యాంగుల ఉచిత ఉపకరణాల కొరకు దరఖాస్తుల పొడిగింపు

77చూసినవారు
గద్వాల: దివ్యాంగుల ఉచిత ఉపకరణాల కొరకు దరఖాస్తుల పొడిగింపు
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బియం సంతోష్ శనివారం ఒక ప్రకటనలో, దివ్యాంగులకు ఉపకరణాల కొరకు దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 10వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. అర్హులైన దివ్యాంగులు https: ///obmms. cgg. gov. in వెబ్ సైట్లో ధ్రువీకరణ పత్రాలతో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంసీఆర్ చప్పల్స్, స్మార్ట్ కేన్స్, వాకింగ్ స్టిక్స్, క్రచెస్, హియరింగ్ ఎయిడ్లు, వీల్ చైర్లు, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్, విద్యార్థులకు ట్యాబ్లు, ల్యాప్ టాప్ లు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్