గద్వాల: ధాన్యం కొనుగోలు సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

257చూసినవారు
గద్వాల: ధాన్యం కొనుగోలు సజావుగా నిర్వహించాలి: కలెక్టర్
జోగులాంబ గద్వాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొనుగోలు కేంద్రాల నిర్వహకుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ, జిల్లాలో 87 కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ నెల 9 నుంచి కొనుగోలు ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులకు 24 గంటల్లో చెల్లింపులు చేయాలని, ఇతర రాష్ట్రాల ధాన్యం కొనుగోలు చేస్తే బాధ్యులపై సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్