గద్వాల: గాంధీ విగ్రహానికి న్యాయవాదుల వినతి

130చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా కోర్టు ప్రాంగణాన్ని ప్రజలకు అనువైన స్థలంలో నిర్మించాలని కోరుతూ న్యాయవాదులు వారం రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి, స్థానిక జిల్లా కోర్టు నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి, జిల్లా కోర్టు సముదాయాన్ని ప్రజలకు అనుకూలమైన ప్రదేశంలో నిర్మించేలా ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్