గద్వాల: బాలికపై అత్యాచార యత్నం.. వృద్ధుడికి మూడేళ్ల జైలు

27చూసినవారు
గద్వాల: బాలికపై అత్యాచార యత్నం.. వృద్ధుడికి మూడేళ్ల జైలు
బాలికకు మాయమాటలు చెప్పి, అత్యాచారం చేసేందుకు యత్నించిన కేసులో ఓ వృద్ధుడు జైలు పాలయ్యాడు. శుక్రవారం నిందితుడి (63)కి జోగులాంబ గద్వాల జిల్లా పోక్సో కోర్టు జడ్జి వి. శ్రీనివాస్ మూడేళ్ల జైలు శిక్ష, రూ. 1, 000 జరిమానా విధించారని పోలీసులు తెలిపారు. కేటీదొడ్డి పిఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై కోర్టులో సాక్ష్యాలు ప్రవేశపెట్టడంతో నేరం రుజువైందన్నారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్