గద్వాల: కమలం గూటికి మాజీ కౌన్సిలర్ శ్రీమన్నారాయణ

392చూసినవారు
గద్వాల: కమలం గూటికి మాజీ కౌన్సిలర్ శ్రీమన్నారాయణ
జోగులాంబ గద్వాల జిల్లా రాజకీయాల్లో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పట్టణంలోని డికె బంగ్లాలో జరిగిన కార్యక్రమంలో, 09వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీమన్నారాయణ తన అనుచరులైన 60 మంది యువకులతో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరికి గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జి ఓఏస్ రెడ్డి, జిల్లా యువ నాయకురాలు డికె. స్నిగ్ధ రెడ్డి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్నిగ్ధ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపునకు, పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్