జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం పోలీసులు మంగళవారం కర్ణాటక నుంచి గంగన్పల్లికి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను పట్టుకున్నారు. టిప్పర్ డ్రైవర్, యజమాని చంద్రశేఖర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పగడాల శ్రీనివాసులు తెలిపారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబర్ (KA33A8616) గల ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.