జోగులాంబ గద్వాల జిల్లా అనంతపురం గ్రామం నుండి పూడూర్ వెళ్లే మార్గంలో మూడు రోజుల క్రితం వడ్డే పర్శ (34) అనుమానాస్పదంగా మృతి చెందాడు. రూరల్ పోలీసులు శుక్రవారం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఎర్రవల్లి మండలం దువ్వాసిపల్లి గ్రామానికి చెందినవాడు, అతనికి ఇద్దరు కుమారులున్నారు. ఏడాది క్రితం భార్య వదిలి వెళ్లింది. సంఘటనా స్థలంలో ఎలాంటి పెనుగులాట లేకపోవడం, పక్కన మద్యం బాటిల్ ఉండటంతో, గుర్తుతెలియని వ్యక్తులు వడ్డే పర్శను హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.