జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ నిబంధనలు పాటించని ఉపాధ్యాయుడికి మెమో జారీ చేయాలని మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేణుకాదేవిని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలో హాజరు రిజిస్టర్లు పరిశీలించిన కలెక్టర్ సెలవులకు రెండు రోజుల ముందే దరఖాస్తు ఇవ్వాలని, వాట్సాప్ సందేశాలు ఆమోదయోగ్యం కాదని హెచ్చరించారు.