గద్వాల: ముగిసిన నామినేషన్లు.. 200 పైగా దరఖాస్తులు!

24చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 200కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. గడువు ముగిసినప్పటికీ కేంద్రాల్లో అభ్యర్థులు వేచి ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు మినహా ఇతరులెవరినీ లోపలికి అనుమతించలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్