జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తులసిరామ్ మట్టం సమీపంలో ఉన్న జాలి రఘురాం పెయింట్ షాప్‌లో సోమవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో కొంతసేపు భయాందోళనలు నెలకొన్నాయి. షాప్‌లో ఉన్న విద్యుత్ వైరింగ్ లోపం వల్ల మంటలు చెలరేగినట్లు సమాచారం. అగ్ని వేగంగా వ్యాపించి షాప్‌లో ఉన్న పెయింట్ డబ్బాలు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ. 30 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. స్థానికులు, ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అధికారులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.