జోగులాంబ గద్వాల్ జిల్లా, మానపాడు మండలం, నారాయణపురం గ్రామంలో బాలయోగి నారాయణస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా, తుమ్మలపల్లి గ్రామానికి చెందిన గోకుల కృష్ణ జంట కోలాటం బృందం చిన్నారులు అద్భుతమైన కోలాట ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. చిన్న వయసులోనే ఇంత చక్కటి ప్రదర్శన ఇవ్వడం అభినందనీయమని గ్రామస్తులు కొనియాడారు. కోలాటం మాస్టర్ దేవ బండ బి. పరమేష్ గారిని అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరుపుకోవాలని గ్రామ పెద్దలు ఆకాంక్షించారు.