కాళోజీ కళాక్షేత్రంలో ప్రభుత్వ కార్యాలయం: కళాకారుల ఆగ్రహం

311చూసినవారు
కాళోజీ కళాక్షేత్రంలో ప్రభుత్వ కార్యాలయం: కళాకారుల ఆగ్రహం
వరంగల్ నగరంలో రవీంద్రభారతికి ధీటుగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రంలో ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రభుత్వం నిర్ణయంపై కళాకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ భారంగా మారిందని ప్రభుత్వం చెబుతున్న మాటలు హాస్యాస్పదమని, కళాకారుల నుండి వసూలు చేస్తున్న అద్దె డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల టీ హబ్‌లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుపై విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని, కాళోజీ కళాక్షేత్రం విషయంలో కూడా వెనక్కి తగ్గాలని కళాకారులు హెచ్చరిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల్ ప్రాంతంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.