గద్వాల జిల్లాలో దంచికొట్టిన వర్షం

1764చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం వాతావరణాన్ని చల్లబరిచింది. పాల్చర్ల, సోంపురం, మన్నాపురం గ్రామాల్లో కురిసిన ఈ వర్షం, గత కొద్ది రోజులుగా వాన కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఎంతో ఉపశమనాన్ని కలిగించింది. రహదారులపై నీరు చేరి స్వల్ప ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ప్రస్తుత సాగు సీజన్ పంటలకు ఈ వర్షం చాలా అనుకూలంగా ఉంటుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్