అమర్ చింతలోని ఎం బి కర్మెల్ చర్చిలో నూతన కార్యవర్గంఆదివారం ఎన్నికైంది. ఎలక్షన్ ఆఫీసర్ ఫీల్డ్ చైర్మన్ లూథర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం సంఘ సభ్యుల సమక్షంలో ఓటింగ్ ద్వారా జరిగిన ఈ ఎన్నికలో ఎమ్మెస్ హ్యాపీ పాల్ అధ్యక్షులుగా, ఎస్ డి దీన కుమార్ ఉపాధ్యక్షులుగా, ఎం శ్రీనివాస్ పీటర్ సెక్రటరీగా, జె ప్రకాష్ అసిస్టెంట్ సెక్రటరీగా, బి.ఎస్ క్రాంతి ట్రెజరర్ గా, శ్యామ్ అసిస్టెంట్ ట్రెజరర్ గా ఎన్నికయ్యారు. పలువురు కమిటీ సభ్యులు, అడ్వైజర్లు, ఆడిటర్, క్వయర్ ఇన్చార్జి కూడా ఎంపికయ్యారు.