పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం: సర్పంచ్ పిలుపు

1332చూసినవారు
పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం: సర్పంచ్ పిలుపు
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని నేతివానిపల్లి&తండా గ్రామంలో ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమాన్ని సర్పంచ్ పద్మవెంకటేష్ నాయక్ ప్రారంభించారు. ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడం ద్వారా వ్యాధిని శాశ్వతంగా నివారించవచ్చని, అంగవైకల్యాన్ని అరికట్టి పిల్లల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ నెల 28, 29 తేదీలలో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్