జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెలలుగా విద్యార్థులు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను సర్పంచ్ వై. శైలజ శ్రీనివాసరెడ్డి తన సొంత నిధులతో బోరు వేయించి పరిష్కరించారు. ప్రధానోపాధ్యాయులు మహేష్ ఈ సమస్యను సర్పంచ్ దృష్టికి తీసుకురాగా, ఆమె వెంటనే స్పందించి బోరు వేయించారు. బోరులో నీరు పుష్కలంగా పడడంతో విద్యార్థులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.