జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల మండలం గోనుపాడు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగిన సీతారామ కళ్యాణోత్సవంలో గోకుల కృష్ణ జంట కోలాట బృందం చిన్నారులు అద్భుతమైన కోలాట ప్రదర్శనలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకున్నారు. మాజీ ఎంపీటీసీ సర్పంచ్ ఈ. శ్రీనివాసులు గౌడ్, బొట్టు ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గద్వాల నియోజకవర్గం ఇన్చార్జి సరిత తిరుపతయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కోలాటం మాస్టర్ దేవ బండ బి. పరమేష్‌ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో నిర్వహించడం విశేషం.