గ్రామ సర్పంచ్ నార్య నాయక్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు

1077చూసినవారు
గ్రామ సర్పంచ్ నార్య నాయక్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం మద్దెల బండ తండా గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ యం. నార్య నాయక్ ప్రారంభించారు. 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని, గ్రామ పంచాయతీ ఆఫీస్, చిన్నతండా అంగన్వాడీ సెంటర్లలో ఈ కార్యక్రమం జరుగుతుందని, మూడు రోజుల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రజలు తమ పిల్లలను దగ్గరలోని కేంద్రాలకు తీసుకెళ్లి పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్