ఉదండాపూర్ నిర్వాసితులకు మరో రూ. 150 కోట్లు: జడ్చర్ల ఎమ్మెల్యే

308చూసినవారు
ఉదండాపూర్ నిర్వాసితులకు మరో రూ. 150 కోట్లు: జడ్చర్ల ఎమ్మెల్యే
ఉదండాపూర్ నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ కోసం ప్రభుత్వం తాజాగా రూ. 150 కోట్లు విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఇప్పటివరకు మొత్తం రూ. 400 కోట్లు విడుదల చేసినట్లు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఎక్కువ పరిహారం కోరుతూ కోర్టుకు వెళ్లిన వారితో కూడా మాట్లాడి, వారికి రావాల్సిన మొత్తాన్ని అందజేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల తరహాలోనే, ఉదండాపూర్ నిర్వాసితులకు కేటాయించిన ప్లాట్లను రిజిస్టర్ చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కలెక్టర్‌ను కోరారు.

సంబంధిత పోస్ట్