జడ్చర్ల పట్టణంలో బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ, దేశ జనాభా గణనలో బీసీ కులాల గణన చేపడతామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఏప్రిల్ నుండి ప్రారంభం కానున్న జనాభా గణనలో ఓబీసీ కాలమ్ ఏర్పాటు చేయకపోవడం బీసీలను మరోమారు దగా చేయాలన్న కుట్రకు నిదర్శనమని అన్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీసీలను ఓట్లేసే యంత్రాలుగా, సంపద సృష్టించే యంత్రాలుగా చూస్తున్నారని, హక్కుల కల్పనలో కనీసం మనుషులుగా కూడా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా రాష్ట్ర పార్లమెంట్ సభ్యులందరూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.