సేరిగూడలో పల్స్ పోలియో చుక్కల పంపిణీ

844చూసినవారు
సేరిగూడలో పల్స్ పోలియో చుక్కల పంపిణీ
మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గంలోని సేరిగూడ అంగన్వాడీ కేంద్రంలో ఆదివారం అంగన్వాడీ సిబ్బంది పల్స్ పోలియో చుక్కల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది మమత, ఆయా మన్నెమ్మ, ఆశ వర్కర్ విజయలక్ష్మి, వార్డు సభ్యులు కే శివ కుమార్, శిరీష వేణు, VRA జే సురేష్ పాల్గొన్నారు. 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులను మమత టీచర్ కోరారు.

సంబంధిత పోస్ట్