జడ్చర్ల నియోజకవర్గంలోని ఊర్కొండపేట గ్రామానికి చెందిన బోల్గాం బుచ్చమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు రమేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తీర్మని రవీందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల కన్వీనర్ షైబాజ్, నాయకులు వహీద్, మనోహర్ రెడ్డి, జంగయ్య, మ్యాకల శ్రీనివాసులు, శ్రీశైలం, అమీర్, విజేందర్, మైనద్దీన్, జహంగీర్, నసీర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ద్యాప నిఖిల్ రెడ్డి అండగా నిలుస్తున్నారని ఈ సంఘటన తెలియజేస్తుంది.