జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల్ వెలుగోముల గ్రామంలో గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సువర్ణమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాల లబ్ధిదారుల స్పందనలపై మాట్లాడారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి, గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.