మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం ఉడిత్యాలలో బుధవారం టీవీ ఆర్టిస్ట్ కొమురక్కపై జరిగిన దాడి కలకలం రేపింది. ఇంట్లో జరిగిన బంగారం దొంగతనం గురించి నిలదీయడంతో, కాశిరెడ్డి గూడకు చెందిన వంశీకృష్ణతో పాటు మరో ఏడుగురు కలిసి ఫొటో దిగుతామని చెప్పి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంశీకృష్ణ, వికాస్, చంద్రశేఖర్, గోవా శివ, రామ్ చరణ్, నరేశ్, శివ, కిషోర్ లపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.