జడ్చర్ల: ప్రేమ పేరుతో మోసం.. ప్రియురాలు ధర్నా

208చూసినవారు
జడ్చర్ల: ప్రేమ పేరుతో మోసం.. ప్రియురాలు ధర్నా
మిడ్జిల్ గ్రామానికి చెందిన వివాహితుడు, అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో నమ్మించి గర్భవతిని చేశాడు. 10 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకొని గర్భవతిని చేశాడని, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించినట్లు యువతి తెలిపింది. ఈ ఘటనపై శుక్రవారం యువతి, ఆమె కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి ఇంటి ముందు ధర్నా నిర్వహించి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ శివనాగేశ్వర్ తెలిపారు.

ట్యాగ్స్ :