జడ్చర్లలోని తెలంగాణ గిరిజన గురుకుల కళాశాలలో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కోర్సులో ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ నిరీక్షణ రావు శనివారం తెలిపారు. 50% మార్కులతో ఇంటర్ (ఎంపీసీ, బైపీసీ) పూర్తి చేసిన పురుష
విద్యార్థులు నేరుగా కళాశాలను సంప్రదించి ప్రవేశం పొందవచ్చు. కళాశాలలో ఎన్.సి.సి శిక్షణ కూడా ఉంది. వివరాలకు 9849448944, 8555019270 నంబర్లను సంప్రదించవచ్చు.