మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు. ఉదండాపూర్ నిర్వాసితులకు పరిహారం అందడంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ సుదర్శన్ గౌడ్, ఉదండాపూర్ గ్రామ సర్పంచ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.