జడ్చర్ల: రూ. 1. 15కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

191చూసినవారు
జడ్చర్ల: రూ. 1. 15కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డు సంజీవయ్య కాలనీలో రూ. 1.15 కోట్ల 'ముడా' నిధులతో చేపట్టే సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కాలనీల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని, గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్