మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం సమీపంలోని జడ్చర్ల-కల్వకుర్తి రహదారిపై ఆదివారం సాయంత్రం శ్రీనివాస ఫిల్లింగ్ స్టేషన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ వాహనం ఆపి టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో, వెనుక నుండి వేగంగా వచ్చిన బైక్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో మసిగొండ్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.