జడ్చర్ల: రూ. 79. 36 కోట్ల భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం

607చూసినవారు
జడ్చర్ల: రూ. 79. 36 కోట్ల భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం
నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండల అభివృద్ధికి రూ. 79.36 కోట్లు మంజూరు చేసినందుకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి ఆదివారం స్థానిక నాయకులు, ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. మాధారం నుంచి మార్చాల రోడ్డుకు రూ. 35.63 కోట్లు, ఊర్కొండ నుంచి యంగంపల్లి కాటన్ మిల్లు వరకు రహదారి కోసం రూ. 43.73 కోట్లు కేటాయించినట్లు పార్టీ మండల అధ్యక్షుడు ఆయుబ్ పాషా, మాజీ సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి వెల్లడించారు. ఈ నిధులు మండలంలో మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడతాయని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్