జడ్చర్ల: కన్నబిడ్డలను సాకలేక... కలెక్టరేట్ లో తల్లి ఆవేదన

261చూసినవారు
బిడ్డలకు కడుపునిండా అన్నం పెట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని, వారిని హాస్టళ్లలో చేర్పించి చదివించాలని కోరుతూ జడ్చర్లకు చెందిన సరోజ అనే మహిళ మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం పిల్లలతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఆమె, రెండేళ్ల క్రితం భర్త మరణించడంతో కుటుంబ భారం మోయలేక ఇబ్బందులు పడుతున్నానని, పిల్లలను హాస్టళ్లలో చేర్పించి, తనకు అక్కడే ఏదైనా పని కల్పించాలని వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్