ఆదివారం బాలానగర్ ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం, ఒడిశా పూరి జిల్లాకు చెందిన అనిల్ సాహో (21) అనే యువకుడు ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులు మందలించారన్న మనస్తాపంతో జడ్చర్ల నియోజకవర్గంలో శనివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక హిందుస్థాన్ కంపెనీలో పనిచేస్తున్న అనిల్, స్వగ్రామంలో ఓ మైనర్ బాలికను ప్రేమించాడు. పెళ్లి విషయంలో తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఘోరానికి ఒడిగట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.