జడ్చర్ల: కేసీఆర్ కు నోటీసులు.. బీఆర్ఎస్ నిరసన

1233చూసినవారు
మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో బీఆర్ఎస్ శ్రేణులు గురువారం రాత్రి అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టాయి. మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేసి, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలను మానుకోవాలని, లేదంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్