మహబూబ్ నగర్: అదనపు కలెక్టర్ కారుకు ప్రమాదం

1703చూసినవారు
మహబూబ్ నగర్: అదనపు కలెక్టర్ కారుకు ప్రమాదం
మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ప్రయాణిస్తున్న కారు సోమవారం బాలానగర్ మండల కేంద్రం సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అదనపు కలెక్టర్, ఆర్డీఓ నవీన్ తోపాటు కారులో ఉన్న ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసం అయింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్