మహబూబ్ నగర్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో మార్చి 31న, మంగళవారం ఉదయం 10:30 గంటలకు పిల్లలమర్రి రోడ్డులో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి ఆపై చదివిన 18-30 ఏళ్ల యువత 500 ఖాళీల భర్తీకి అర్హులని జిల్లా అధికారిణి మైత్రి ప్రియ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు సర్టిఫికెట్లు, బయోడేటాతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు 89193 80410 నంబర్ ను సంప్రదించాలని కోరారు.