మహబూబ్ నగర్: ధరణితో భూదందాలు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

378చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు తన కుటుంబ సభ్యులతో కలిసి వందల ఎకరాల భూమిని అక్రమంగా దక్కించుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకుని, ప్రైవేట్ కంపెనీలను బెదిరించి ఈ భూములను బదలాయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ భూకబ్జాపై హౌస్ కమిటీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, హరీశ్ రావు నిజాయితీపరుడైతే అందుకు సహకరించాలని సీఎం సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్