పోలియో చుక్కల కార్యక్రమం: సర్పంచ్ రషీద్ చేతుల మీదుగా ప్రారంభం

878చూసినవారు
పోలియో చుక్కల కార్యక్రమం: సర్పంచ్ రషీద్ చేతుల మీదుగా ప్రారంభం
మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గం, ఊర్కొండ మండలం ఊర్కొండపేటలో ఆదివారం రోజు పోలియో చుక్కల కార్యక్రమం గ్రామ సర్పంచ్ అబ్దుల్ రషీద్ మరియు ఆశ వర్కర్ భాగ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఈ పోలియో చుక్కలు వేయడం జరిగింది. సర్పంచ్ మాట్లాడుతూ నిండు జీవితానికి రెండు చుక్కలు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రేపని శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్