బాలనగర్ మండలం తిరుమలగిరి గ్రామంలో గురువారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికల భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో స్పెషల్ ఆఫీసర్, గ్రామ పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వ మంచి పనులను వివరించడంతో పాటు, ఇల్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.