పెద్దాయపల్లిలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం

894చూసినవారు
పెద్దాయపల్లిలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం
మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గంలోని పెద్దాయపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఆదివారం అంగన్వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ గాయత్రి లక్ష్మీయ్య ఈ కార్యక్రమాన్ని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్