క్యూ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ: కాంగ్రెస్ నేత ప్రశంసలు

666చూసినవారు
క్యూ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ: కాంగ్రెస్ నేత ప్రశంసలు
రంగారెడ్డి గూడలో ఆదివారం క్యూ న్యూస్ 2026 క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధికార ప్రతినిధి జనంపల్లి దుష్యంత్ రెడ్డి క్యాలెండర్‌ను ఆవిష్కరించి, క్యూ న్యూస్ పత్రిక ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా ప్రజల ముందుకు తీసుకెళ్తూ విశ్వసనీయతను సంపాదించుకుందని, ప్రజా ప్రయోజనాలను కాపాడుతూ ప్రజాస్వామ్య విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందని ప్రశంసించారు. గ్రామీణ, నియోజకవర్గ స్థాయిల్లో ప్రజల సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువస్తున్న పత్రిక పాత్ర అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఊరుకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్ రెడ్డి, జడ్చర్ల క్యూ న్యూస్ రిపోర్టర్ అంకూరి స్వామి, బక్క బాలయ్య, రంగారెడ్డి గూడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్