బూత్ స్థాయిలో బీజేపీ బలోపేతం: కార్యకర్తలకు నరేందర్ రావు పిలుపు

445చూసినవారు
బూత్ స్థాయిలో బీజేపీ బలోపేతం: కార్యకర్తలకు నరేందర్ రావు పిలుపు
బుధవారం చారగొండ మండలంలో జరిగిన బీజేపీ శిక్షణ శిబిరంలో జిల్లా అధ్యక్షులు నరేందర్ రావు మాట్లాడుతూ, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని కోరారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం సంక్షేమం, దేశాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు. ఈ శిబిరంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్ గౌడ్, మండల అధ్యక్షులు చలమోని కృష్ణ, చంద్రారెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్