చేతి గుర్తుకే ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేయాలి: బృంగి రత్నమాల

447చూసినవారు
చేతి గుర్తుకే ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేయాలి: బృంగి రత్నమాల
నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మున్సిపాలిటీలోని ఏడో వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, ఈరోజు సాయంత్రం పత్తి గడపగడపకు తిరుగుతూ చేతి గుర్తుకే ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గోరెటి శ్రీనివాసులు, రావుల చెన్నకేశవులు, సామ బంగారయ్య, బీసా హుస్సేన్, అంజన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్