Feb 15, 2026, 17:02 IST/
చిరంజీవి చేతికి గాయం? అభిమానుల్లో ఆందోళన
Feb 15, 2026, 17:02 IST
మెగాస్టార్ చిరంజీవి చేతికి బ్యాండేజ్ కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అల్లు శిరీష్ తన వివాహ ఆహ్వాన పత్రికను చిరంజీవికి అందజేస్తున్న సమయంలో తీసిన ఫోటోల్లో ఈ కట్టు కనిపించింది. ఇటీవల వరుస షూటింగ్లు, యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్న చిరంజీవికి గాయమైందా లేక సాధారణ వైద్య ప్రక్రియలో భాగంగా బ్యాండేజ్ వేసుకున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది.