మహబూబ్ నగర్: రెండు గ్రామాల మధ్య ఘర్షణ.. యువకుల దాడి

309చూసినవారు
మహబూబ్ నగర్: రెండు గ్రామాల మధ్య ఘర్షణ.. యువకుల దాడి
శుక్రవారం అచ్చంపేట, లింగోటం గ్రామాల మధ్య మురుగునీటి తరలింపు విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. అచ్చంపేట గ్రామస్థులు తమ గ్రామానికి మురుగునీరు తరలించరాదని నిరసిస్తూ లింగోటం యువకులపై బీరు సీసాలు, కర్రలతో దాడి చేశారని బాధితులు ఆరోపించారు. తమపై కుల వివక్ష చూపుతున్నారని, కేసులు పెడతామని బెదిరించారని బాధితులు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్