సీఎంఆర్‌ఎఫ్ పేదల వైద్యానికి భరోసా: ఎమ్మెల్యే

842చూసినవారు
సీఎంఆర్‌ఎఫ్ పేదల వైద్యానికి భరోసా: ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కొనగట్టుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎంఆర్‌ఎఫ్ పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారంలో పెద్ద భరోసాగా నిలుస్తోందని తెలిపారు. అనారోగ్యంతో ఏ కుటుంబమూ ఆర్థికంగా కుంగిపోకుండా ప్రభుత్వం అర్హులకు సహాయం అందిస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల జీవితాల్లో మార్పు తేవడమేనని స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయాన్ని ప్రజా సమస్యల పరిష్కార కేంద్రంగా తీర్చిదిద్దామని, సీఎంఆర్‌ఎఫ్ సహాయం అందించడంలో ఆలస్యం జరగకుండా పర్యవేక్షిస్తున్నామని, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఆరోగ్యం, పేదల సంక్షేమమే తమ అజెండా అని, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందించడమే తమ సంకల్పమని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్