మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ 32 వ డివిజన్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని డివిజన్ కార్పొరేటర్ కామర్తి ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా హాజరై, చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. దేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి ఇంట్లో ఉన్న 5 సంవత్సరాల లోపు ప్రతీ చిన్నారికి పోలియో చుక్కలను తల్లిదండ్రులు తప్పనిసరిగా వేయించాలని ఆయన సూచించారు.