
కెసిఆర్, తాత మధు దిష్టిబొమ్మ దహనం
స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు స్థానిక అంబేద్కర్ కూడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ ఇప్పటివరకు అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఒక దళిత స్పీకర్ ఎదురుగా కూర్చోవాల్సి వస్తుందని, దానిని అవమానకరంగా భావించి అసెంబ్లీకి రావడం లేదని అన్నారు. అనంతరం కెసిఆర్, తాత మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మక్తల్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






































