నారాయణ పేట జిల్లా ఎక్సైజ్ సీఐ ఏం. అశోక్ కుమార్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్ లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో భీమ్ సేన సేవా సమితి సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామిగౌడ్, రాష్ట్ర కన్వీనర్ మహమ్మద్ హాజీబాబా పాల్గొని ఆయనకు వీడ్కోలు సన్మానం చేశారు. అశోక్ కుమార్ సేవలు ఆప్కారి శాఖకు మరింత కాలం అవసరమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.