నారాయణపేట జిల్లా, మక్తల్ మండల కేంద్రానికి చెందిన అనిల్ కుమార్ రెడ్డి అనే యువకుడు బుధవారం తన సొంత ఖర్చులతో గ్రామపంచాయతీకి ఒక నూతన కంప్యూటర్ ను విరాళంగా అందజేశాడు. గ్రామ ప్రజలకు మెరుగైన ఆన్ లైన్ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ సహాయం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ హనుమంత్ రెడ్డి, గ్రామస్థుల తరఫున అనిల్ కుమార్ రెడ్డిని శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.