ఎయిడ్స్ నియంత్రణపై కళాజాత ప్రదర్శన

0చూసినవారు
ఎయిడ్స్ నియంత్రణపై కళాజాత ప్రదర్శన
జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సౌజన్యంతో NACO వారి సహకారంతో వెన్నెల కల్చరల్ అకాడమీ కళాబృందం మక్తల్ బస్టాండ్ లో హెచ్ఐవి పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లె సుద్దుల ద్వారా ఆటపాటలతో ప్రజలకు ఎయిడ్స్ హెచ్ఐవి గురించి అర్థమయ్యే విధంగా వివరించారు. ఈ సందర్భంగా కళాకారులు హెచ్ఐవి సంక్రమించే విధానం రాకుండా ముందస్తు జాగ్రత్తలు, మందులు వాడకం ప్రాధాన్యత, సుఖ వ్యాధుల లక్షణాలపై అవగాహన కల్పించారు. కళాబృందం సభ్యులు నరసింహ, చెన్నయ్య, యాదగిరి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్